NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..

- August 24, 2026 , by Maagulf
NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..

న్యూ ఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ (NEET PG) 2026 టెస్టుకు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. అడ్మిట్ కార్డు రిలీజ్ చేసే తేదీ విషయంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) మార్పులు చేసింది.

ముందుగా ఆగస్టు 27న అడ్మిట్ కార్డులు రిలీజ్ చేయనున్నట్టు బోర్డు ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఆ అడ్మిట్ కార్డుల విడుదల తేదీలో మార్పు చేసింది. ఆగస్టు 24, 2026న నీట్ పీజీ అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. నీట్ పీజీ 2026 పరీక్షను ఆగస్టు 30, 2026న నిర్వహించనుంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో సింగిల్ షిఫ్ట్‌లో ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించనుంది. అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును అధికారిక NBEMS వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో User ID, Passwordతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంతకీ అడ్మిట్ కార్డులను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? ప్రాసెస్ ఏంటి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అడ్మిట్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
అభ్యర్థులు ఈ కింది విధంగా నీట్ పీజీ 2026 హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేయొచ్చు.

  • NBEMS అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  • నీట్ పీజీ 2026 సెక్షన్ ఫస్ట్ ఓపెన్ చేయండి.
  • మీకు (Applicant Login – Admit Card) ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు User ID, Password ఎంటర్ చేయండి.
  • మీ పూర్తి లాగిన్ వివరాలను కూడా సబ్మిట్ చేయండి.
  • స్క్రీన్‌పై అడ్మిట్ కార్డు కనిపిస్తుంది.
  • అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

ఇంపార్టెంట్ డేట్స్:

  • అడ్మిట్ కార్డు రిలీజ్ డేట్ ఆగస్టు 24, 2026
  • నీట్ పీజీ 2026 ఎగ్జామ్ డేట్ : ఆగస్టు 30, 2026
  • ఇంటర్న్‌షిప్ గడువు : సెప్టెంబర్ 30, 2026
  • రిజల్ట్స్ డేట్: సెప్టెంబర్ 30, 2026లోపు

అభ్యర్థులు అడ్మిట్ కార్డు రిలీజ్ అయిన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌కు (Direct Link) వెళ్లి లాగిన్ అవ్వండి. మీ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. నీట్ పరీక్షకు హాజరయ్యే ముందు మీ అడ్మిట్ కార్డులోని ఎగ్జామ్ సెంటర్, పరీక్షా తేదీ, టైమ్, మీ వ్యక్తిగత వివరాలు, ఎగ్జామ్ గైడ్ లైన్స్ అన్ని అంశాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com