మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- August 26, 2026
మస్కట్: నివాస ప్రాంతాల్లో భారీ ట్రక్కులు, నిర్మాణ యంత్రాలు, ఇతర భారీ వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల చిన్నారులు, పాదచారుల భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని మస్కట్ మున్సిపాలిటీ హెచ్చరించింది.
భారీ వాహనాలను నివాస ప్రాంతాల్లో నిలిపివేయడం వల్ల ప్రమాదాల అవకాశాలు పెరగడంతో పాటు శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు వంటి అత్యవసర సేవల వాహనాలు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
భారీ వాహనాల రాకపోకలు, పార్కింగ్ కారణంగా స్థానిక రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని మున్సిపాలిటీ వెల్లడించింది.
నివాస ప్రాంతాలను సురక్షితంగా, ప్రశాంతంగా ఉంచేందుకు ప్రజలు, వాహన యజమానులు అధికారులతో సహకరించాలని అధికారులు కోరారు. ముఖ్యంగా పిల్లలు, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నివాస ప్రాంతాల్లో భారీ ట్రక్కులు, యంత్రాలను అనధికారికంగా పార్కింగ్ చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







