విలన్ అవ్వాలనుకుంటున్న శ్రీకాంత్
- August 18, 2016
అప్పట్లో కుర్ర విలన్‌గా పాత్రలు పోషించాడు. ఆ తర్వాత హీరో అయ్యాడు. ఒకదాని తర్వాత ఒకటి మంచి అవకాశాలు రావడంతో హీరోగానే సెటిలయ్యాడు. ఆ తర్వాత విలన్‌గా అవకాశాలు వచ్చినా తిప్పికొట్టాడు. ఆ హీరో శ్రీకాంత్. ప్రెసిడెంటుగారి పెళ్లాం వంటి చిత్రాల్లో విలన్‌గా చేసిన శ్రీకాంత్.. మళ్లీ ఇప్పుడు అటువైపు చూస్తున్నాడా అంటే చూస్తున్నాడనే చెప్పాలి. ఇటీవల హీరోగా చాన్స్‌లు తగ్గిపోవడం, అడపాదడపా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తుండడంతో విలన్‌గానైనా చేయడానికి సిద్ధమయ్యాడు శ్రీకాంత్. అయితే తాను విలన్ కావాలంటే మాత్రం ఇలాగే కేరెక్టర్ ఉండాలని షరతులు విధిస్తున్నాడు. నెగెటివ్ పాత్రల్లో కనిపించాలని తనకూ ఉందని, అయితే.. దానికి తగిన బలమైన పాత్రను ఎవరైనా ఆఫర్ చేస్తే తప్పకుండా ఆ సినిమాలో తప్పకుండా నటిస్తానని చెబుతున్నాడు.
అయితే.. ఆ సినిమా పెద్ద హీరోది అయి ఉండాలని, విలన్ పాత్ర చాలా స్టైలిష్‌గా ఉండాలని షరతులు పెట్టాడు. ఈ షరతులు మచ్చుకు మాత్రమే. ఇలాంటి మరెన్నో షరతులు శ్రీకాంత్ పెట్టాడట.
మరి, ఇన్ని షరతులు పెట్టిన శ్రీకాంత్‌కు విలన్ ఆఫర్లు వస్తాయో..రావో చూడాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







