ఒత్తిడిని దూరం చేసుకోండిలా..

- July 28, 2015 , by Maagulf
ఒత్తిడిని దూరం చేసుకోండిలా..

ప్రస్తుత బిజీ లైఫ్‌లో రకరకాల కారణాలపరంగా అనేక విధాలుగా ఒత్తిడికి గురవుతున్నాం. ప్రొద్దున్న లేచినప్పట్నుంచీ రాత్రి పడుకొనే ముందు వరకూ అనేక రకాల సమస్యలతో మనం సతమతమవుతూ ఉంటాం. వీటి నుంచి కొంత ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ మనం మన ఆహారంలో తీసుకోవల్సినవి. ముఖ్యంగా మొదటిది పాలు. పాలలో ఉండే లాక్టియం మన మెదడుకు సాంత్వననిస్తుంది.అందుకే రీసెంట్‌గా పాల నుండి లాక్టియం మాత్రలను తయారు చేసి ఒత్తిడి ఉపశమనకారులుగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. డార్క్‌ చాక్లెట్‌ తీసుకోవడం రోజూ ఒక అలవాటుగా ఉన్నవారిలో ఒత్తిడికి లోనయ్యే సందర్భాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. చమేలీ, చామంతిలాంటి పువ్వులకు ఒత్తిడిని తగ్గించే శక్తి ఉందట. ఇంకా విటమిన్‌ సి అధికంగా ఉండే జామ, నిమ్మజాతి పండ్లు ఒత్తిడిని కల్గించే కార్టిసాల్‌ అనే హార్మోను స్ధాయిని తగ్గించడానికి తోడ్పడతాయి. అంతే కాదు ఓట్స్‌, పుదీనా, వెల్లుల్లి, మొక్కజొన్నలాంటివి మంచి ఒత్తిడి ఉపశమనకారులుగా పనిచేస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com