హైదరాబాద్‌లో తాగి డ్రైవ్ చేస్తే తస్మాత్ జాగ్రత్త
- July 28, 2015
హైదరాబాదులో తప్పతాగి బండి నడిపారో ఇక అంతే సంగతులు. మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అలా మందుకొట్టి.. స్టీరింగ్ పట్టుకుని అభాగ్యుల ప్రాణాలతోపాటు తమ ప్రాణాలను సైతం గాలిలో కలిపేసే వారికి కొత్త శిక్ష అమలులోకి వచ్చింది. సాధారణంగా హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్ పక్కాగా చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. అలా దొరికిన మందుబాబులకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ న్యాయస్థానం విభిన్న శిక్ష విధించింది. ఇప్పటిదాకా ఫైన్ కట్టేసి ఊపిరిపీల్చుకుంటున్న బడాబాబులకు ఎర్రమంజిల్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం రుచించికపోవచ్చు. ఇంతకీ ఆ శిక్ష ఏంటంటే..? మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించాలని మందుబాబులను ఆదేశించింది. హైదరాబాదులో ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఈ ప్రత్యేక విధులు నిర్వర్తించక తప్పదని స్పష్టం చేసింది. తాజాగా, ఎర్రమంజిల్ కోర్టు 35 మంది మందుబాబులకు ఈ తరహా సామాజిక సేవా శిక్ష విధించడం చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







