గోంగూర బంగాళాదుంప కూర
- August 18, 2016
కావలసిన పదార్దములు :
బంగాళాదుంపలు : పావుకేజీ
గోంగూర : ఒక కట్ట
జీలకర్ర : అర టీ స్పూన్
మెంతులు : పావు టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ – : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
తయారుచేయు విధానం :
1) గోంగూరను శుబ్రంగా కడిగి చిన్నముక్కలుగా కట్ చేసి వుంచాలి.
2) బంగాళాదుంపలు కడిగి పొట్టుతీసిన ముక్కలు నీళ్ళలో వేసి పక్కన ఉంచాలి.
3) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక మెంతులు, జీలకర్ర వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక కారం, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి చిన్న మంటమీద పదినిముషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి.
4) పదినిముషాలు ఉంచి తరువాత మూతతీసి కట్ చేసిన గోంగూర వేసి కలిపి, రెండు నిముషాలు మూతపెట్టి మరో రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆపాలి.
* అంతే పుల్లపుల్లని గోంగూర, బంగాళాదుంపల కూర రెడి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







