కొత్త తరహావ్యాయామాలు ఎంచుకోవాలి...
- August 18, 2016
మ నలో చాలామంది వ్యాయామం చేయాలన్న ఆలోచన రాగానే వెనకాముందూ ఆలోచించకుండా వెంటనే మొదలు పెట్టేస్తారు. కానీ అది మంచి పద్ధతి కాదు. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు వీటి గురించి కాస్త తెలుసుకోండి.. కొందరికి సిజేరియన్ వంటి శస్త్రచికిత్సలు జరిగి ఉంటాయి. అలాగే ఇంకేదయినా అనారోగ్య కారణాల వల్ల శస్త్రచికిత్సలు జరిగినా జిమ్‌లో శిక్షణ ఇచ్చే నిపుణులకు ఆ వివరాలు చెప్పి వ్యాయామాన్ని మొదలుపెట్టాలి. ఇంత బరువు తగ్గాలని లక్ష్యం నిర్దేశించుకునే ముందు.. అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంతేకాని ఒక నెలలో ఐదు కేజీలు తగ్గిపోవాలి వంటి భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవద్దు. దానివల్ల నిరాశే తప్ప సానుకూల ఫలితాలు సాధించలేం. మనం చేసే వ్యాయామం ప్రభావం మన కండరాలపై పనిచేయాలి.అలా జరగడం వల్ల కెలొరీలు కరిగి కొవ్వు తగ్గుతుంది. కీళ్లని ప్రభావితం చేసే వ్యాయామాలు, చిన్న చిన్న బరువులు ఎత్తడం ఇందుకు ఉత్తమమైన మార్గాలు.్ద ప్రతి నెలా మనం చేసే వ్యాయామాలని మారుస్తూ ఉండాలి. నిపుణుల సాయంతో కొత్త తరహావి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి ఒకేలాంటివి చేయడం కొత్తగా వచ్చే ఫలితాలు కూడా ఉండవు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







