గోధుమ చక్కిలాలు
- July 28, 2015
గోధుమ చక్కిలాలు
కావలిసిన పదార్ధాలు
గోధుమపిండి - అరకిలో
కారం - ఒక స్పూను
ఇంగువ - ఒక స్పూను
ఉప్పు - తగినంత
పసుపు - ఒక స్పూను
వాము - ఒక స్పూను
నువ్వులు - రెండు స్పూన్లు
మంచి నీళ్లు - తగినన్ని
తయారీ విధానం
ముందుగా గోధుమపిండిని ఒక బాణలిలోకి తీసుకుని నీళ్లు తప్ప పైన చెప్పినవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన గోధుమ పిండి మిశ్రమాన్ని ఒక పలుచని గుడ్డలో వేసి మూటలా కట్టి దాన్ని ప్రెషర్ కుక్కర్లో అడుగున నీళ్లు పోసి, దానిమీద ఒక గిన్నె పెట్టి ఈ పిండి మూటను పెట్టి సుమారు పావుగంట సేపు ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి మూట విప్పి అవసరమైతే కొన్ని నీళ్లు చిలకరించి పిండిని ముద్దలా చేయాలి. తరువాత పిండిని చిన్న ముద్దల్లా చేసి చక్కిలాల గొట్టంలో పెట్టి ప్లాస్టిక& కాగితం మీద చిన్న చిన్న చక్రాల్లా వత్తాలి. తరువాత వీటిని జాగ్రత్తగా తీసి కాగిన నూనెలో వేసి వేయించాలి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







