షూటింగ్ ప్రారంభించనున్న రజినీకాంత్
- August 18, 2016
క్రేజీ స్టార్స్ మూవీస్ గురించి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. వాళ్ల సినిమాలు ఎప్పుడొస్తాయా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎదురు చూస్తుంటారు. స్టార్ డమ్ ఉన్న నటులు కొంతకాలం ఖాళీగా ఉన్నా ఫ్యాన్స్ కు నిద్రపట్టదు. తమ ఫేవరేట్ హీరో మళ్లీ ఎప్పుడు షూటింగ్ లో పాల్గొంటాడా అని వెయిట్ చేస్తుంటారు. ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వీర ఫ్యాన్స్ కు ఇప్పుడో శుభవార్త.
సూపర్ స్టార్ రజనీకాంత్ కొంతకాలంగా షూటింగ్స్ కు దూరంగా ఉన్నాడు. కబాలి మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రజనీ ఏ షూటింగ్ లోనూ పాల్గొనలేదు. ఈ మధ్య అమెరికా కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. కబాలి సినిమాను రజనీకాంత్ తన ఫ్యామిలీతో సహా అమెరికాలోనే చూశాడు.
ఇలా ఉండగా ఆయన ఆరోగ్యం బాగాలేదనే ప్రచారం కూడా జరిగింది.
తాజాగా రజనీకాంత్ మళ్లీ షూటింగ్స్ కు అటెండ్ కాబోతున్నాడు. ఈ గుడ్ న్యూస్ ను ఆయనే స్వయంగా అనౌన్స్ చేశాడు. యాక్షన్ కు రెడీగా ఉన్నానని చెబుతున్నాడు. రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమా చేయాల్సి ఉంది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటివారంలో ఈ పిక్చర్ షూటింగ్ కు సూపర్ స్టార్ అటెండ్ అవుతాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సి ఉంది.
రోబో 2.0 తాజా షెడ్యూల్ వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుంది. రజనీకాంత్ కూడా ఈ షెడ్యూల్ లోనే షూటింగ్ కు అటెండ్ కాబోతున్నాడు. రజనీకాంత్ షూటింగ్ కు వచ్చేలోగా ఇతర నటీనటులపై కొన్ని కీలకమైన సీన్స్ తీయడానికి డైరెక్టర్ శంకర్ రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. రోబోగా రజనీకాంత్ చేసే సీన్స్ ఈ సినిమాకే హైలైట్ అవుతాయంటున్నారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







