చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- October 09, 2026
అమెరికా: అమెరికాలోని తెలుగు వారిని ఐక్యం చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా చార్లెట్ లో ఎంతో వైభవంగా నాట్స్ చార్లెట్ సంబరాలు నిర్వహించింది. తెలుగు వారికి ఐకమత్యానికి, తెలుగు సాంస్కృతిక వైభవానికి ఈ నాట్స్ చార్లెట్ సంబరాలు 2026 ప్రతీకగా నిలిచాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినా, భిన్న నేపథ్యాలు ఉన్న వారు.. మన తెలుగు వారి సంబరాలు అనే మమకారంతోఒక్కటై ఇంటి పండుగలాగా ఈ సంబరాలు జరుపుకున్నారు.
తెలుగు సంఘాల మధ్య ఉన్న సఖ్యత, సమైక్యత ఈ సంబరాల్లో కనిపించింది. తానా,జీటీఈ, ఏపీటీఈ వంటి ప్రముఖ తెలుగు సంస్థల నాయకులు, ప్రతినిధులు ఎలాంటి బేధాభిప్రాయాలకు తావులేకుండా ఒకే వేదికపైకి వచ్చి ఈ వేడుకను విజయవంతం చేశారు. అలాగే తెలుగు వారిని కలిపే ఈ సంబరానికైనా నేను ముందుంటానని నాట్స్ అధ్యక్షులు రాజ్ అల్లాడ తెలిపారు. ఆయన ఈ వేడుకల్లో సతీసమేతంగా విచ్చేసి అందరితోనూ మమేకమవడం నాట్స్ చార్లెట్ విభాగానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఇక ఈ సంబరాలలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ సాంస్కృతిక ప్రతిభను చాటుకుంటూ తెలుగు వారిని కట్టపడేశారు. శాస్త్రీయ సంగీతం, క్లాసికల్ డ్యాన్స్, ఫ్రీస్టైల్ నృత్యాలు కేవలం ప్రదర్శనలుగా కాకుండా మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే వారధులుగా నిలిచాయి. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 'సైన్స్ ఫెస్ట్' చిన్నారులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. డ్రై ఐస్, ప్లాస్మా బాల్ వంటి తొమ్మిది రకాల ఆసక్తికరమైన ప్రయోగాలను చిన్నారులు ఎంతో ఆనందంగా తిలకించారు. చదువుతో పాటు వినోదాన్ని పంచుతూ సాగిన ఈ ప్రయోగాలు పిల్లల్లో సరికొత్త ఆలోచనలను రేకెత్తించాయి.
ఈ సంబరాలకు ఏకంగా 800 మంది ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఈ సంబరాల విజయానికి ఓ నిదర్శనం. ఇది చార్లెట్ తెలుగు సమాజంలో పెరిగిన ఐక్యతను, ఉత్సాహాన్ని స్పష్టంగా చాటిచెప్పింది. వేలాదిగా తరలివచ్చిన ప్రేక్షకులు, అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లు, ప్రోత్సహించిన తల్లిదండ్రులు, సహకరించిన స్పాన్సర్లు అందరూ ఒకే కుటుంబంగా కలిసికట్టుగా శ్రమించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, విజ్ఞానం అన్నీ కలగలిసిన ఈ చార్లెట్ సంబరాలు 2026.. చార్లెట్ లో నివపించే తెలుగువారి గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా, తెలుగువారి ఐకమత్యానికి ప్రతీకగా నిలిచాయి. చార్లెట్ లో ఇంత గొప్పగా సంబరాలు నిర్వహించిన నాట్స్ చార్లెట్ విభాగం నాయకులు దీపిక తో పాటు మిగిలిన నాయకులందరినీ నాట్స్ చార్లెట్ అడ్వైజరీ సభ్యులు మూర్తి గులివిందల, నేషనల్ కోఆర్డినేటర్ వెంకట దగ్గుపాటి, పాస్ట్ చైర్మన్ మధు కొర్రపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పొనకాల, ఇండియా లయసన్ అరుణ్ శ్రీరామినేని, చాప్టర్ కోఆర్డినేటర్ దీపిక సయ్యపరాజు, జాయింట్ కోఆర్డినేటర్ పల్లవి అప్పని, ఈవెంట్స్ వినీల దొప్పలపూడి, వుమెన్ ఎంపవర్మెంట్
ప్రవీణ పాకలపాటి, ట్రెజరర్ లక్ష్మి బిజ్జల, స్పోర్ట్స్ సిద్ధార్థ చాగంటి, సోషల్ మీడియా సుమ జుజ్జూరు, కో చైర్ రూప మర్రి ల ఆర్ధ్వర్యం లో ఎంతో సమన్వయంతో జరిగిన ఈ తెలుగు సంబరాల ను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- బుల్లెట్ రైలు ట్రయల్ రన్ పై అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్
- యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..
- ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వాడకంపై కేంద్రం హెచ్చరిక
- తమకు జరిగిన నష్టానికి అమెరికా బాధ్యత వహించాలి: ఇరాన్
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!
- కువైట్‌లో నవంబర్ 30న అంతర్జాతీయ స్టార్టప్ పోటీ..!!







