విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- August 31, 2026
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో మరొక నూతన అధ్యాయం మొదలైంది. ఆసియాలోనే అత్యున్నత వైద్య సేవలకు ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) హాస్పిటల్స్ ఇకపై పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో కొలువుదీరనుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ అత్యాధునిక మెగా హాస్పిటల్ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. విశాఖ ఆనందపురం మండలం ఎండాడ ప్రాంతంలో ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి ఈ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
భారీ పెట్టుబడితో 9,000 ఉపాధి అవకాశాలు
విశాఖలో రూపుదిద్దుకోనున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం ఏఐజీ యాజమాన్యం వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ. 2,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వెయ్యి పడకల సామర్థ్యంతో ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా మారుతుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 9,000 మందికి నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తద్వారా ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ఆసుపత్రి ఎంతగానో దోహదపడనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!







