అల్ మెన్‌హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- August 31, 2026
అబుదాబి: అల్ మెన్‌హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణులతో దాడి జరిగినట్లు మీడియాలో వస్తున్న వార్తలను యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
ఎలాంటి ముప్పు ఎదురైనా సమర్థంగా స్పందించేందుకు యూఏఈ సాయుధ దళాలు అత్యంత అప్రమత్త స్థితిలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ సార్వభౌమత్వం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడే విధంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
ప్రజలు సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది. పుకార్లు, నిర్ధారణ కాని లేదా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా సహా ఇతర మార్గాల్లో ప్రచారం చేయవద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







