విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- August 31, 2026
అబుదాబి: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్ తరాలను సృజనాత్మకంగా, చురుకుగా, దేశభక్తితో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కొత్త విద్యా సంవత్సరం సందర్భంగా ఆయన ఆడియో సందేశం ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. “మీరు మన దేశ భవిష్యత్తు. నిరంతరం చదవండి, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండండి. మన జాతీయ గుర్తింపును గౌరవించండి” అని సూచించారు.
ప్రపంచం వేగంగా మారుతోందని, ప్రతిరోజూ కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని షేక్ మహ్మద్ బిన్ జాయెద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై విద్యార్థులు దృష్టి పెట్టాలని, కృత్రిమ మేధస్సు (AI), సాంకేతికతను సానుకూలంగా వినియోగించుకోవాలని సూచించారు.
అదే సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తూ సృజనాత్మకత, చురుకుదనం, దేశభక్తి కలిగిన తరాలను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
“దేవుడు మిమ్మల్ని కాపాడి, విజయాన్ని ప్రసాదించాలి. మీరు ఎల్లప్పుడూ యూఏఈకి గర్వకారణంగా, గౌరవంగా నిలవాలి” అని విద్యార్థులను ఉద్దేశించి యూఏఈ అధ్యక్షుడు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







