కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- August 31, 2026
కువైట్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలతో కువైట్లో ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం 1,560 బాటిళ్ల దిగుమతి చేసిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. క్రిమినల్ సెక్యూరిటీ విభాగం పరిధిలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ డ్రగ్ కంట్రోల్ అధికారులు రెండు వేర్వేరు కేసుల్లో ఈ అరెస్టులు చేశారు. నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కొనసాగుతున్న భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.
హవల్లీలో ఇద్దరి అరెస్ట్
మొదటి కేసులో హవల్లి ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను యాంటీ-నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 12 బాటిళ్ల మద్యం, విక్రయాల ద్వారా వచ్చినట్లు భావిస్తున్న 320 కువైటీ దినార్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సల్మియాలో భారీగా మద్యం పట్టివేత
రెండో కేసులో సల్మియా ప్రాంతంలో మరో వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి విక్రయించేందుకు ఉద్దేశించినట్లు అనుమానిస్తున్న 1,548 బాటిళ్ల దిగుమతి మద్యంను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానితులతో పాటు స్వాధీనం చేసుకున్న మద్యం, నగదును తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ డ్రగ్ కంట్రోల్ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







