బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- September 01, 2026
మనామా:భద్రత, ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, బ్రిటన్ కీలక చర్చలు జరిపాయి. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీని బ్రిటన్ ఛార్జ్ డి అఫైర్స్ సైమన్ మార్టిన్ మనామాలో కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు.
ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై ఇరుపక్షాలు చర్చించాయి. ముఖ్యంగా కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ అండ్ ప్రాస్పెరిటీ అగ్రిమెంట్ కింద పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన రంగాల్లో సహకారాన్ని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇరు దేశాల సభ్యత్వం నేపథ్యంలో పరస్పర సమన్వయంపై కూడా చర్చించారు. తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఇరువురు అధికారులు సమీక్షించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించేందుకు చేపడుతున్న చర్యలపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. ఈ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం కొనసాగించేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలపై చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







