కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!

- September 01, 2026 , by Maagulf
కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!

కువైట్: కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై కీలక ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 31 వరకు ట్రక్కుల ప్రయాణానికి నిర్దిష్ట సమయాల్లో నిషేధం విధిస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది.

సెప్టెంబర్ 1 నుంచి 2027 జూన్ 14 వరకు ట్రక్కులు అన్ని రహదారులపై కింది సమయాల్లో తిరగడానికి అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఉదయం: 6:30 గంటల నుంచి 9:00 గంటల వరకు, మధ్యాహ్నం: 12:30 గంటల నుంచి 3:30 గంటల వరకు, 2027 జూన్ 15 నుంచి నిబంధనల్లో మార్పులు ఉంటాయని ప్రకటించారు.

ఇక 2027 జూన్ 15 నుంచి ఆగస్టు 31 వరకు ట్రక్కులపై మధ్యాహ్నం: 12:30 గంటల నుంచి 3:30 గంటల వరకు మాత్రమే ఆంక్షలు కొనసాగుతాయి.  ట్రాఫిక్ రద్దీని సజావుగా నిర్వహించడంతో పాటు రహదారులపై భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్ యజమానులు, డ్రైవర్లు నిర్ణయించిన సమయాలను తప్పనిసరిగా పాటించాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com