'సినిమా రివ్యూ: ‘రోమాంఛకం’.!

- September 04, 2026 , by Maagulf
\'సినిమా రివ్యూ: ‘రోమాంఛకం’.!

సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా తన సొంత బ్యానర్‌లో నిర్మించిన చిత్రమే ‘రోమాంఛకం’. వేణు గోపాల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి విచ్చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సినిమాని బాగా ప్రమోట్ చేశారు. టీజర్, ట్రైలర్స్.తో పాటూ, ఆడియల్ సింగిల్స్.. ఇలా ప్రచార చిత్రాలన్నీ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేశాయ్. మరి, సినిమా రిలీజ్ తర్వాత అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే, ‘రోమాంఛకం’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
అన్వేష్ (సుమంత్ ప్రబాస్) చదువు పూర్తి చేసుకుని, ఓ స్టార్టప్ పెట్టాలన్న ఆలోచనలో వుండే కుర్రాడు. అందుకోసం స్నేహితులతో కలిసి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ క్రమంలోనే ‘రోమాంచకం’ అనే ఓ డేటింగ్ యాప్‌ని తయారు చేస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు తమ తమ అవసరాలు తీర్చడమే ఈ యాప్ ముఖ్యోద్దేశం. ఈ యాప్ ద్వారానే చెన్నైలో వున్న మైథిలి (అనంతికా సనీల్ కుమార్) అన్వేష్‌కి పరిచయమవుతుంది. మెల్లమెల్లగా ఆమెతో ప్రేమలో పడతాడు అన్వేష్. మైథిలి బర్త్‌డే కోసం సర్‌ప్రైజ్ చేయాలని చెన్నై వస్తాడు అన్వేష్. సడెన్‌గా మైథిలి, అన్వేష్‌నీ, అతని యాప్‌నీ బ్లాక్ చేస్తుంది. అందుకు కారణం ఏంటీ.? మైథిలికి అసలు ఏమైంది.? ఆమెని కనిపెట్టేందుకు అన్వేష్ ఏం చేశాడు.? వీరిద్దరూ తిరిగి కలిశారా.? లేదా.? తెలియాలంటే ‘రోమాంచకం’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
యంగ్‌స్టర్ సుమంత్ ప్రబాస్ ఆల్రెడీ తన గత చిత్రాలతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అదే ఈజ్ అండ్ టాలెంట్‌తో ఈ సినిమాలోనూ ప్రదర్శించాడు. అన్వేష్ పాత్ర  ఈ జనరేషన్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. అనంతికా సనీల్ కుమార్.. ‘8 వసంతాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలోనూ అందంగా కనిపిస్తూనే తనదైన టాలెంట్‌తో ఆకట్టుకుంది. ఆమె పాత్ర చుట్టూ వచ్చే డిఫరెంట్ ట్విస్టులు సినిమాలో బాగుంటాయ్. ముఖ్యంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు హీరో స్నేహితుల గ్యాంగ్.. ఈ గ్యాంగ్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఎప్పుడు స్క్రీన్‌పై కనిపించినా నవ్వులే నవ్వులు. ఈ క్యారెక్టర్ల మధ్య వచ్చే సంభాషణలు.. నయా ట్రెండ్ డైలాగ్స్ సినిమాకి హైలైట్. హీరో, హీరోయిన్ మధ్య కనెక్షన్‌కి సంబంధించి కొన్ని లోపాలున్నప్పటికీ కామెడీ వాటిని మర్చిపోయేలా చేస్తుంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ.. అనే క్యాప్షన్స్‌తో పార్టులు పార్టులుగా డివైడ్ చేసి రూపొందించిన ‘రోమాంచకం’ పక్కా పైసా వసూల్ అనేలా క్యారెక్టర్స్ చిత్రీకరణ జరిగింది. ఉపేంద్ర లిమాయేని పెట్టి చేసిన గెస్ట్ పర్‌ఫామెన్స్ కూడా ఓకే. ఇలా నటీనటులంతా సినిమాకి చక్కగా న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు వేణుగోపాల్ తొలి సినిమానే అయినా.. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గ కథను సెలెక్ట్ చేసుకుని, ఎలాంటి రిస్కు లేకుండా కామెడీ మెయిన్ మోటోగా పెట్టుకుని కథనాన్ని నడిపించాడు. అదే ఈ సినిమా సక్సెస్ బాటలో నడుస్తుందనడానికి కారణం కావచ్చు. అక్కడక్కడా కొన్ని, కాాదు, కాదు చాలానే లాజిక్కులుండవ్.. కానీ, కామెడీ మ్యాజిక్ సినిమాని బోర్ కొట్టనివ్వదు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ బాగుంటాయ్. అలాగే, పాటలు బాగున్నాయ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా వుంది. డైలాగ్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సందీప్ రెడ్డి వంగా నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా సినిమాకి టెక్నికల్ టీమ్ వర్క్ కూడా సింప్లీ సూపర్బ్.

ప్లస్ పాయింట్స్:
క్యాప్షన్‌లో వున్నట్లే.. లవ్ ట్రాక్ కాస్త అటూ ఇటూ వున్నప్పటికీ.. హాస్యం, ఉత్కంఠ నెక్స్ లెవల్, ఇంకా పతాక సన్నివేశాలు.. 

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు (పెద్దగా కౌంట్ చేయక్కర్లేదనుకోండి) 

చివరిగా:
‘రోమాంచకం’.. నవ్వుల్ నవ్వుల్.   పక్కా పైసా వసూల్.. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com