బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- September 06, 2026
మనామా: బహ్రెయిన్‌లో మత బోధన, మత మార్గదర్శకత్వం, ఉపన్యాసాలు, మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం తాజాగా సవరించారు. మతపరమైన కార్యకలాపాలకు మరింత పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని బహ్రెయిన్ న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, వక్ఫ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మత బోధన, మత గైడ్ లైన్స్ లైసెన్సుల నియంత్రణకు సంబంధించిన 2011 నాటి తీర్మానం నంబర్ 56లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ 2026 నాటి తీర్మానం నంబర్ 74ను అమలు చేస్తున్నారు. న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, వక్ఫ్ శాఖ మంత్రి నవాఫ్ బిన్ మొహమ్మద్ అల్ మావ్దా ఈ సవరించిన తీర్మానాన్ని జారీ చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం.. మత బోధన, మతపరమైన ఉపన్యాసాలతో పాటు సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా నిర్దేశిత విధానాల ప్రకారం అవసరమైన లైసెన్సు పొందాల్సి ఉంటుంది.
ప్రత్యేక కమిటీలు ఏర్పాటు
లైసెన్సుల జారీ, నియంత్రణ కోసం సంబంధిత జనరల్ డైరెక్టరేట్ల పరిధిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. షరియా, పరిపాలనా, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు ఈ కమిటీలలో సభ్యులుగా ఉంటారు. ప్రేయర్ స్థలాలు, మాతమ్లు, ఇతర సంబంధిత ప్రాంగణాల్లో మత బోధన, కార్యక్రమాలకు లైసెన్సులు జారీ చేయడానికి అవసరమైన ప్రమాణాలు, నిబంధనలను ఈ కమిటీలు రూపొందిస్తాయి.
లైసెన్సుదారులకు పలు బాధ్యతలు
ఇక లైసెన్సు పొందిన వారు మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలు, సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. మతపరమైన ప్రసంగాలకు నిర్దేశించిన నియమాలు, మర్యాదలను కూడా అనుసరించాల్సి ఉంటుంది. మతపరమైన జ్ఞానాన్ని ప్రజలకు చేరవేయడం, మితవాదాన్ని ప్రోత్సహించడం, ఇస్లామిక్ విలువలు, సద్గుణాలను వ్యాప్తి చేయడంలో మత బోధకులు, మార్గదర్శకులు కీలక పాత్ర పోషిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ తీర్మానం పరిధిలోకి వచ్చే వ్యక్తులు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఒక నెలలోపు తమ కార్యకలాపాలు, లైసెన్సులను నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







