సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- September 06, 2026
రియాద్: సౌదీ అరేబియా, మలేషియా భద్రతా సంస్థలు సమన్వయంతో భారీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మొత్తం 505.6 కిలోగ్రాముల కెటమైన్ అక్రమ రవాణాకు సంబంధించిన ప్రయత్నాన్ని మలేషియా అధికారులు భగ్నం చేశారు.
సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అందించిన నిఘా సమాచారంతో మలేషియా అధికారులకు ఈ ఆపరేషన్‌లో కీలక ఆధారాలు లభించాయని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ తలాల్ బిన్ షల్హౌబ్ తెలిపారు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాయల్ మలేషియన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కు చెందిన యాంటీ-నార్కోటిక్స్ యూనిట్ చర్యలు చేపట్టి, 505.6 కిలోల కెటమైన్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుంది.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సమన్వయం అక్రమ మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవడంలో కీలకంగా మారిందని తలాల్ బిన్ షల్హౌబ్ పేర్కొన్నారు. ఈ సంయుక్త విజయం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న నేర ముఠాలను ఎదుర్కోవడంలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన భద్రతా సమన్వయానికి నిదర్శనమని తెలిపారు.
జాతీయ భద్రతకు, ముఖ్యంగా యువతకు మాదకద్రవ్యాల ద్వారా ముప్పు కలిగించే నేర ముఠాలను గుర్తించి నిర్వీర్యం చేయడంలో సౌదీ అరేబియా అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం నుంచి సమాజాలను రక్షించేందుకు అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో కలిసి సౌదీ అరేబియా తన చర్యలను కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







