గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- September 06, 2026
హైదరాబాద్: తెలంగాణలో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుపై మరో కీలక అడుగు పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో Airports Authority of Indiaప్రతిపాదిత విమానాశ్రయానికి అనువైన స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖకు చెందిన సాంకేతిక బృందం 2026 సెప్టెంబర్ 7న జిల్లాలో పర్యటించనుంది. సుమారు నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను బృందం పరిశీలించే అవకాశం ఉంది.
భౌగోళిక పరిస్థితులు, కొండలు, రైల్వే మార్గాలకు సమీపం :
గతంలో రామవరం, చుంచుపల్లి, సుజాతనగర్ ప్రాంతాల్లో ప్రతిపాదించిన స్థలాలు భౌగోళిక పరిస్థితులు, కొండలు, రైల్వే మార్గాలకు సమీపం వంటి కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలింది. తాజా పరిశీలనలో సాంకేతిక, భద్రతా, ఆపరేషనల్ అంశాలను ప్రధానంగా అంచనా వేయనున్నారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల విషయంలో Airports Authority of India (AAI) నిర్వహించే ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం కీలకమైనది. సైట్ ఎంపిక, సాధ్యాసాధ్యాల అధ్యయనం, అబ్స్టాకిల్ లిమిటేషన్ సర్వే, వాతావరణ డేటా విశ్లేషణ తదితర అంశాలను AAI పరిశీలిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనంతరగావ్, కొత్తగూడెం, మహబూబ్నగర్, జక్రాన్పల్లి ప్రాంతాల్లో కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల కోసం ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనాలను ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వానికి 2025లో సమర్పించిన వివరాల ప్రకారం కొత్తగూడెం, మహబూబ్నగర్ స్థలాలు అనుకూలంగా లేవని, జక్రాన్పల్లి స్థలం కొన్ని షరతులతో సాంకేతికంగా అనుకూలమని తేలింది.
కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటైతే భద్రాచలం, కొత్తగూడెం పరిసర ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంది. తాజా సైట్ పరిశీలన ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







