రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- September 08, 2026
రష్యా లోని సుందరమైన మరియు ప్రమాదకరమైన పర్వత ప్రాంతమైన కబర్డినో-బల్కారియాలో ఘోరమైన ప్రకృతి వైపరీత్యం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ మౌంట్ మిజిర్గి శిఖరంపై ఒక్కసారిగా భారీ మంచు చరియలు (Avalanche) విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ట్రిప్ కోసం వెళ్లిన 33 మంది సభ్యులున్న పర్వతారోహకుల బృందాన్ని ఈ మంచు సాంద్రత ఒక్కసారిగా కమ్మేసింది.
11 మంది దుర్మరణం.. ఆరుగురికి తీవ్ర గాయాలు
ఈ ఊహించని ప్రమాదంలో పర్వతారోహకుల బృందానికి చెందిన కనీసం 11 మంది దుర్మరణం చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అదృష్టవశాత్తూ ఈ బృందంలోని పది మంది పర్వతారోహకులు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా కిందకు చేరుకోగలిగారు.
గాలింపు చర్యలకు ప్రతికూల వాతావరణం అడ్డంకి
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికీ ఆరుగురి ఆచూకీ లభించకపోవడంతో సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే, అక్కడ వీస్తున్న తీవ్రమైన చల్లటి గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరియు మళ్లీ మంచు చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
తాజా వార్తలు
- సల్మానియాలో ప్రత్యేక బ్రెస్ట్ హెల్త్ యూనిట్ ప్రారంభం..!
- దుబాయ్‌లో కార్ నంబర్ ప్లేట్ కు భారీ ధర.. !!
- ఒమన్ అభివృద్ధికి యువతే పునాది..!!
- సౌదీలో విద్యుత్, వాటర్ ఛార్జీల సవరణ..!!
- ఖతార్ ఫిఫా అండర్-17.. టిక్కెట్ సేల్స్ ప్రారంభం..!!
- కువైట్‌లో కార్మికుల జీతాలపై నిఘా..!!
- కువైట్‌లో మంత్రి హత్యకు కుట్ర.. ముగ్గురికి మరణశిక్ష
- దుబాయ్‌లో ఏఐ రంగానికి భారీ ప్రోత్సాహం..
- కొత్త రూపంలో దుబాయ్ ఫౌంటెన్.. బుర్జ్ లేక్‌లో ఆకట్టుకుంటున్న వెండి నిర్మాణాలు
- ఆర్థిక సంబంధాల బలోపేతంపై కువైట్–భారత్ చర్చలు..!!







