ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!

- September 08, 2026 , by Maagulf
ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!

దోహా: ఖతార్ జనరల్ ట్యాక్స్ అథారిటీ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 1 నుంచి స్వీట్‌న్డ్ డ్రింక్స్‌ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన విశ్లేషణ సర్టిఫికెట్లను ‘ధరీబా’ (Dhareeba) ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా ఆమోదించనున్నారు. కొత్త విధానంలో పన్ను చెల్లింపుదారు ముందుగా ధరీబా ప్లాట్‌ఫామ్‌లో ఉత్పత్తి రిజిస్ట్రేషన్ దరఖాస్తు సమర్పించాలి. అనంతరం ఉత్పత్తి నమూనాను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన, ట్యాక్స్ అథారిటీలో రిజిస్టర్ అయిన ప్రయోగశాలలో పరీక్షలకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.

ల్యాబొరేటరీలో చక్కెరలు, స్వీటెనర్ల రకాలు, వాటి పరిమాణాలను పరీక్షిస్తారు. పరీక్ష ఫలితాలను ల్యాబ్ ఆమోదించిన తర్వాత, టెస్ట్ డేటా మరియు విశ్లేషణ సర్టిఫికెట్ ఆటోమేటిక్‌గా ధరీబా ప్లాట్‌ఫామ్‌కు చేరుతుంది. దీంతో ఇకపై విశ్లేషణ సర్టిఫికెట్లను మాన్యువల్‌గా జత చేయాల్సిన అవసరం ఉండదు. పేపర్‌వర్క్ తగ్గడంతో పాటు డేటా ఖచ్చితత్వం పెరగడం, ఉత్పత్తి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమాచార సమన్వయం మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

స్వీట్‌న్డ్ డ్రింక్స్‌పై ఎక్సైజ్ పన్ను పరిధిని విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఎలక్ట్రానిక్ విధానం అమల్లోకి వస్తోంది. డిజిటల్ సేవలను మరింత అభివృద్ధి చేయడం, సంబంధిత ప్రభుత్వ సంస్థల మధ్య ఎలక్ట్రానిక్ సమన్వయాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు జనరల్ ట్యాక్స్ అథారిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com