దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- September 10, 2026
చికాగో: సెప్టెంబర్ 9: అమెరికాలో తెలుగు వారిని కలిపేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. చికాగో నాట్స్ విభాగం నిర్వహించిన ఈ టోర్నమెంట్లో దాదాపు 150 మందికి పైగా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్, కేవలం ఆటకే పరిమితం కాకుండా చికాగోలో ఉండే స్థానిక తెలుగు వారిని ఒక తాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఏ.టీ.ఏ తో సహా పలు ఇతర ప్రముఖ తెలుగు సంస్థల జట్లు, స్థానిక క్రీడా బృందాలు, క్రీడాస్ఫూర్తితో ఈ టోర్నమెంట్లో పోటీపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ టోర్నమెంట్లో 'టీమ్ బ్రదర్స్' విజేతగా నిలవగా, 'ఫాసక్ వారియర్స్' రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.
ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడంలో మాజీ ఈసీ సభ్యులు హరీష్ జమ్ముల, ఈసీ సభ్యులు వీర తక్కెళ్లపాటి ల ప్రణాళిక, షెడ్యూలింగ్, సమన్వయం ఎంతగానో దోహదపడ్డాయి. అలాగే చాప్టర్ సభ్యులు నరేంద్ర కడియాల, అంజయ్య వెలూరు, సతీష్ త్రిపురనేని, వరుణ్ కుమార్ గడ్డం, నాగరాజ్ మేడ, భాను చందర్ కీర్తి ల నాయకత్వం ఈ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించింది.గోపీకృష్ణ ఉలవ, మనోహర్ పాములపాటి, పాండు చెంగల్శెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, షారుఖ్ సయ్యద్, వినోత్ బాలగురు తదితర వాలంటీర్లు తమ శ్రమతో ఈ టోర్నమెంట్‌ను చిరస్మరణీయంగా మార్చారు.
నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీనివాస్ బొప్పన, శ్రీరామ్ కొప్పాక, శేషు మారం రెడ్డి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, మాజీ ఈసీ సభ్యుడు ఆర్.కె. బాలినిని, మాజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి తదితరులు విచ్చేసిఈ టోర్నమెంట్‌ను తిలకించారు. క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. అలాగే, హ్యూస్టన్ నుండి ప్రత్యేకంగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేష్ చిలుకూరి ఈ టోర్నమెంట్ కు పూర్తి మద్దతు తెలిపారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన చికాగో బృందాన్ని, విజేతలను ప్రత్యేకంగా అభినందించారు.
క్రీడాకారులకు మరియు అతిథులకు ప్రధాన స్పాన్సర్ 'బౌల్ ఓ బిర్యానీ' సంస్థతో పాటు ఇతర స్పాన్సర్లు అందించిన రుచికరమైన బిర్యానీలు ఈ టోర్నమెంట్‌ని ఓ వేడుకలా మార్చాయి. క్రీడా స్ఫూర్తి, స్నేహభావంతో సాగిన ఈ టోర్నమెంట్ భవిష్యత్తులోనూ మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రేరణ ఇచ్చిందని నాట్స్ చికాగో విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు







