కొత్త ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌పై ఆర్‌ఓపీ క్లారిటీ..!!

- September 11, 2026 , by Maagulf
కొత్త ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌పై ఆర్‌ఓపీ క్లారిటీ..!!

మస్కట్: ఒమన్‌లో కొత్త ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై రాయల్ ఒమన్ పోలీస్ (ROP) స్పష్టత ఇచ్చింది. ఈ పోస్టు పోలీసుల అధికారిక ప్రకటన కాదని తెలిపింది. కొత్త ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉందని, అధికారికంగా ఇంకా అమలు చేయలేదని ఆర్‌ఓపీ వెల్లడించింది. సిస్టమ్ అమలుకు సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది.

ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకే..

వాహనదారులు ట్రాఫిక్ భద్రతా నిబంధనలను పాటించేలా ప్రోత్సహించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని ఆర్‌ఓపీ తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ఏవైనా కొత్త నిర్ణయాలు, మార్పులు వచ్చినప్పుడు ఆర్‌ఓపీ అధికారిక ఛానళ్లు, అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ధృవీకరణ లేని సోషల్ మీడియా పోస్టులను షేర్ చేయడం లేదా వాటిని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com