2027 నుంచి డీడబ్ల్యూసీకి ఫ్లైదుబాయ్ కార్యకలాపాలు..!!
- September 11, 2026
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) నుంచి అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DWC)కు విమాన కార్యకలాపాల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఫ్లైదుబాయ్ తొలి విమానయాన సంస్థగా కొంత కార్యకలాపాలను DWCకి తరలించే అవకాశం ఉంది. 2027లోనే సుమారు ఐదు నుంచి ఆరు విమానాలను DXB నుంచి DWCకి తరలించే అవకాశం ఉందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. దుబాయ్ మీడియా ఆఫీస్ నిర్వహించిన అంతర్జాతీయ మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. DXB నుంచి DWCకి మార్పు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా, కొన్ని నెలలు నుంచి కొన్ని సంవత్సరాల వ్యవధిలో జరుగుతుందని చెప్పారు.
DXB సామర్థ్యం త్వరలో పూర్తయ్యే అవకాశం
ప్రస్తుతం DXB సామర్థ్యం రానున్న కొన్నేళ్లలో పూర్తిగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రిఫిత్స్ పేర్కొన్నారు. ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ విమానయాన సంస్థలు భవిష్యత్తులో మరింత విస్తరించాలంటే DWC అదనపు సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఫ్లైదుబాయ్ కార్యకలాపాలను DWCకి తరలించడం ద్వారా DXBలో కొన్ని స్లాట్లు ఖాళీ అవుతాయని, వాటిని ఇతర విస్తరణ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
వచ్చే ఏడాది రెండో రన్‌వే
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రెండో రన్‌వే 2027లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయ్యే నాటికి DWCలో మొత్తం ఐదు రన్వేలు ఉండనున్నాయి. అయితే ఒకేసారి నాలుగు రన్‌వేలను మాత్రమే సాధారణంగా వినియోగిస్తారు. ఐదో రన్‌వేను అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచుతారు.
150 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం
ప్రారంభ దశలో రెండు రన్‌వేలే సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. DWC 150 మిలియన్ల ప్రయాణికుల వార్షిక సామర్థ్యాన్ని చేరుకునే వరకు ఇవే సరిపోతాయని గ్రిఫిత్స్ తెలిపారు. ఆ తర్వాత ప్రయాణికుల సామర్థ్యం పెరిగే కొద్దీ మూడో, నాలుగో రన్‌వేలను నిర్మిస్తారు. భవిష్యత్తులో DWC పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత DXBలోని అన్ని కార్యకలాపాలను DWCకి తరలించనున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ







