సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
- August 20, 2016
ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధూను తగిన రీతిలో గౌరవించాలని నిర్ణయించిన ఏపీ కేబినెట్ సింధును అభినందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సింధుకూ రూ.3కోట్ల నగదు బహుమతితో పాటు రాజధానిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే సింధును ఒలింపిక్స్ స్థాయిలో తీసుకెళ్లిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే ఏపీలో గోపీచంద్ అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చేలా ప్రతిపాదించాలని కేబినెట్ నిర్ణయించింది. సింధు ఇండియాకు వచ్చిన వెంటనే విజయవాడలో సన్మాన సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ నజరానాను ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సింధు తండ్రి రమణకు లేఖ రూపంలో అందజేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







