విదేశీ పెట్టుబడిదారులు, కుటుంబాలకు 5 ఏళ్ళ రెసిడెన్సీ!
- August 20, 2016
విదేశీ పెట్టుబడిదారులు, వారి కుటుంబాలకు ఐదేళ్ళపాటు బహ్రెయిన్‌లో నివాసం ఉండేందుకు వీలుగా నిబంధనల్ని సవరించాల్సిందిగా ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి, ఓ ప్రోజల్ని ప్రస్తుత లెజిస్లేటివ్ టీమ్ ముందుంచే ప్రయత్నం చేయనున్నారు. పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించడం ద్వారా బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థకూ ఊతమిచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రపోజల్‌కి ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఆయిల్ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉన్న బహ్రెయిన్, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించగలిగితే, తద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెబుతున్నారాయన. తాను చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, స్టాక్ మార్కెట్లలో ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. బహ్రెయిన్ మార్కెట్స్ పుంజుకోవడం దేశ ఆర్థిక ప్రగతికి ఊతమివ్వడం ఖాయమని చెప్పారు ఎంపీ అల్ మరాఫి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







