కువైట్ తీరాలకు తరలివస్తున్న ఫ్లెమింగోలు..!!

- September 12, 2026 , by Maagulf
కువైట్ తీరాలకు తరలివస్తున్న ఫ్లెమింగోలు..!!

కువైట్: కువైట్ తీర ప్రాంతాలు అరుదైన అందంతో సందడి చేస్తున్నాయి. వింటర్ ప్రారంభానికి ముందే పెద్ద సంఖ్యలో ఫ్లెమింగోలు కువైట్ తీరాలకు చేరుకోవడం ప్రారంభించాయి. ముఖ్యంగా కువైట్ బేలోని లోతు తక్కువగా ఉన్న నీటి ప్రాంతాల్లో గుంపులుగా కనిపిస్తున్న ఈ గులాబీ రంగు పక్షులు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

కువైట్‌కు వింటర్ లో వలస వచ్చే ప్రముఖ పక్షుల్లో గ్రేటర్ ఫ్లెమింగో ఒకటి. సాధారణంగా ఆగస్టు నుంచే ఇవి కువైట్‌కు చేరుకుంటాయి. కువైట్ బే, జహ్రా రిజర్వ్, సులైబిఖాత్ బీచ్ తదితర ప్రాంతాల్లో వీటిని పెద్ద సంఖ్యలో చూడవచ్చు. వింటర్ తీవ్రత పెరిగే కొద్దీ ఫ్లెమింగోల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది.  

మార్చి, ఏప్రిల్‌లో తిరుగు ప్రయాణం

కువైట్‌లో కొంతకాలం గడిపిన అనంతరం ఫ్లెమింగోలు సాధారణంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ వరకు తమ సంతానోత్పత్తి ప్రాంతాల వైపు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాయి. ఫ్లెమింగోలు కేవలం ప్రకృతి అందానికే పరిమితం కాకుండా కువైట్ తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. లోతు తక్కువగా ఉన్న నీటిలో, బురద నేలల్లో లభించే ఆల్గీ, సూక్ష్మజీవులు, చిన్న జలచరాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com