ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- September 12, 2026
మస్కట్: ఒమన్‌లోకి కొందరు అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రాయల్ ఒమన్ పోలీస్ (ROP) స్పందించి, వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో పాతదని, 2024లో జరిగిన ఘటనకు సంబంధించినదని ROP స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయాన్ని పరిశీలించినట్టు తెలిపారు. 2024లో ఘటన జరిగిన సమయంలోనే అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ROP వెల్లడించింది.
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు
సోషల్ మీడియాలో వీడియోలు, వార్తలు లేదా ఇతర సమాచారాన్ని షేర్ చేసే ముందు వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని ROP ప్రజలను కోరింది. తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం, పాత వీడియోలను ప్రస్తుత ఘటనలుగా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని సూచించింది. ఒమన్‌కు సంబంధించిన వార్తలు, అధికారిక సమాచారాన్ని తెలుసుకోవడానికి అధికారిక ప్రభుత్వ వర్గాలు, ROP అధికారిక ప్రకటనలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ







