యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!

- September 13, 2026 , by Maagulf
యూఏఈ లాటరీలో  Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!

షార్జా: యూఏఈలో నిర్వహించిన లాటరీ డ్రాలో ఓ వ్యక్తి Dh100,000 బహుమతి గెలుచుకున్నారు. శనివారం జరిగిన డ్రాలో ‘డేస్’, ‘మంత్’ విభాగాల్లో విజేత సంఖ్యలను యూఏఈ లాటరీ ప్రకటించింది. ‘డేస్’ విభాగంలో 12, 11, 1, 16, 10, 25 సంఖ్యలు, ‘మంత్’ విభాగంలో 3 సంఖ్య విజేతలను నిర్ణయించాయి. ఓ యూఏఈ నివాసి ఐదు ‘డేస్’ నంబర్లు, ఒక ‘మంత్’ నంబర్ సరిపోల్చడంతో Dh100,000 బహుమతి దక్కించుకున్నారు. అయితే విజేత వివరాలను లాటరీ నిర్వాహకులు ఇంకా వెల్లడించలేదు. యూఏఈ లాటరీలో టికెట్ కొనుగోలు చేసిన ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్‌గా ‘లక్కీ ఛాన్స్ ఐడీ’ కేటాయిస్తారు. దీని ద్వారా Dh50,000 బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంటుంది.

ఇక యూఏఈ లాటరీలో ధ30 మిలియన్ల జాక్‌పాట్ గెలిచిన తొలి వ్యక్తిగా నేపాల్‌కు చెందిన తయాబ్ ఖాన్ నిలిచారు. అబుదాబిలోని రువైస్ ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఖాన్ వయసు 26 సంవత్సరాలు.  మెరుగైన అవకాశాల కోసం నాలుగేళ్ల క్రితం నేపాల్ నుంచి యూఏఈకి వచ్చిన ఖాన్.. 2024 ప్రారంభంలో ఫేస్‌బుక్‌లో యూఏఈ లాటరీ గురించి తెలుసుకున్నారు. అనంతరం తన స్నేహితులతో కలిసి లాటరీలో పాల్గొంటున్నాడు. మే నెలలో వారి గ్రూప్ విజేత నంబర్లను సరిపోల్చడంతో Dh30 మిలియన్ల జాక్‌పాట్ దక్కింది. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి గెలిచిన ఈ మొత్తాన్ని సమానంగా పంచుకోవడంతో ఒక్కొక్కరికి Dh6 మిలియన్లు లభించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com