బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- September 13, 2026
మనామా: బహ్రెయిన్‌లో రెండు కంపెనీ ప్రాంగణాల్లో చోరీలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐదుగురు ఆసియా దేశాల పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారి వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నట్లు దక్షిణ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ వెల్లడించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. రెండు వేర్వేరు కంపెనీ సైట్ల నుంచి విద్యుత్ కేబుళ్లు, ఎయిర్ కండిషనింగ్ యూనిట్ చోరీకి గురయ్యాయి. దొంగిలించిన వస్తువుల మొత్తం విలువ సుమారు BD14,000 వరకు ఉంటుందని తెలిపారు.
చోరీలకు సంబంధించి రెండు వేర్వేరు ఫిర్యాదులు అందడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. సమాచారం, ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించే చర్యలు చేపట్టారు. దర్యాప్తులో ఐదుగురు అనుమానితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, తదుపరి విచారణ కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని దక్షిణ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- SIIMA 2026 తెలుగు,కన్నడ విజేతలు వీరే..
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!
- ఖతార్‌లో మరింత సులభంగా డొమెస్టిక్ వర్కర్ నియామకం..!!
- ఒమన్–అమెరికా జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం..!!
- ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం







