యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- September 13, 2026
షార్జా: యూఏఈలో నిర్వహించిన లాటరీ డ్రాలో ఓ వ్యక్తి Dh100,000 బహుమతి గెలుచుకున్నారు. శనివారం జరిగిన డ్రాలో ‘డేస్’, ‘మంత్’ విభాగాల్లో విజేత సంఖ్యలను యూఏఈ లాటరీ ప్రకటించింది. ‘డేస్’ విభాగంలో 12, 11, 1, 16, 10, 25 సంఖ్యలు, ‘మంత్’ విభాగంలో 3 సంఖ్య విజేతలను నిర్ణయించాయి. ఓ యూఏఈ నివాసి ఐదు ‘డేస్’ నంబర్లు, ఒక ‘మంత్’ నంబర్ సరిపోల్చడంతో Dh100,000 బహుమతి దక్కించుకున్నారు. అయితే విజేత వివరాలను లాటరీ నిర్వాహకులు ఇంకా వెల్లడించలేదు. యూఏఈ లాటరీలో టికెట్ కొనుగోలు చేసిన ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్‌గా ‘లక్కీ ఛాన్స్ ఐడీ’ కేటాయిస్తారు. దీని ద్వారా Dh50,000 బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంటుంది.
ఇక యూఏఈ లాటరీలో ధ30 మిలియన్ల జాక్‌పాట్ గెలిచిన తొలి వ్యక్తిగా నేపాల్‌కు చెందిన తయాబ్ ఖాన్ నిలిచారు. అబుదాబిలోని రువైస్ ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఖాన్ వయసు 26 సంవత్సరాలు. మెరుగైన అవకాశాల కోసం నాలుగేళ్ల క్రితం నేపాల్ నుంచి యూఏఈకి వచ్చిన ఖాన్.. 2024 ప్రారంభంలో ఫేస్బుక్లో యూఏఈ లాటరీ గురించి తెలుసుకున్నారు. అనంతరం తన స్నేహితులతో కలిసి లాటరీలో పాల్గొంటున్నాడు. మే నెలలో వారి గ్రూప్ విజేత నంబర్లను సరిపోల్చడంతో Dh30 మిలియన్ల జాక్‌పాట్ దక్కింది. మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి గెలిచిన ఈ మొత్తాన్ని సమానంగా పంచుకోవడంతో ఒక్కొక్కరికి Dh6 మిలియన్లు లభించాయి.
తాజా వార్తలు
- SIIMA 2026 తెలుగు,కన్నడ విజేతలు వీరే..
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!
- ఖతార్‌లో మరింత సులభంగా డొమెస్టిక్ వర్కర్ నియామకం..!!
- ఒమన్–అమెరికా జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం..!!
- ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం







