ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- September 13, 2026
అమరావతి: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 14న వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్న ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
కుటుంబ సభ్యులందరూ కలిసి ఉత్సాహం, భక్తిభావం, ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి అని గవర్నర్ పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడిని ఆరాధించడం ద్వారా అడ్డంకులు తొలగి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు.
నూతన కార్యాలు విజయవంతం కావాలని కోరుతూ వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోందని గవర్నర్ అన్నారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరూ శాంతి, సౌభాగ్యం, సామరస్యంతో కూడిన జీవితాన్ని గడిపేలా విఘ్నేశ్వరుడు తన ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!
- కువైట్లోడిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!
- చైనా-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు..!!
- హార్ముజ్ జలసంధి తెరవడం పై ఇరాన్ కీలక ప్రకటన
- మస్కట్‌లో దీపావళి సందడి..!
- డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- ఎల్ఎన్జీ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







