టర్కీలో ఓ వివాహ వేడుకపై బాంబు దాడి ...
- August 20, 2016
టర్కీలో ఓ వివాహ వేడుకపై బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో దాదాపు 30 మంది మృతి చెందగా, 94 మందికి గాయాలయ్యాయి. టర్కీలోని ఘజియాన్టేప్ నగరంలో శనివారం అర్ధరాత్రి ఈ బాంబు దాడి చోటుచేసుకుంది. ఈ దాడిని ఆత్మాహుతి దాడిగా డిప్యూటీ ప్రధాని మెహ్మత్ సిమ్సెక్, టర్కీ ప్రభుత్వం భావిస్తోంది. కుర్దిష్ తిరుగుబాటుదారులు లేక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల పని అయి ఉండవచ్చునని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాంబు దాడిలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.గత ఏడాది కూడా కుర్దిష్ తిరుగుబాటుదారుల దాడులతో టర్కీ వణికిపోయిన సంగతి తెలిసిందే.గత జూన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు ఇస్తాంబుల్‌లో ఎయిర్పోర్ట్ వద్ద తుపాకులు, బాంబులతో మారణహోమం సృష్టించి 44 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఘజియాన్టేప్లో బాంబు దాడిన జరిగిన ప్రాంతాన్ని, సరిహద్దు మార్గాలను మూసివేసి.. పోలీసులు ఆయా ప్రాంతాలను మొత్తం తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సెక్ బృందం ఘటనా స్థలికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రిస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







