టర్కీలో ఓ వివాహ వేడుకపై బాంబు దాడి ...

- August 20, 2016 , by Maagulf
టర్కీలో ఓ వివాహ వేడుకపై బాంబు దాడి ...

టర్కీలో ఓ వివాహ వేడుకపై బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో దాదాపు 30 మంది మృతి చెందగా, 94 మందికి గాయాలయ్యాయి. టర్కీలోని ఘజియాన్‌టేప్‌ నగరంలో శనివారం అర్ధరాత్రి ఈ బాంబు దాడి చోటుచేసుకుంది. ఈ దాడిని ఆత్మాహుతి దాడిగా డిప్యూటీ ప్రధాని మెహ్మత్‌ సిమ్సెక్‌, టర్కీ ప్రభుత్వం భావిస్తోంది. కుర్దిష్ తిరుగుబాటుదారులు లేక ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదుల పని అయి ఉండవచ్చునని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాంబు దాడిలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.గత ఏడాది కూడా కుర్దిష్‌ తిరుగుబాటుదారుల దాడులతో టర్కీ వణికిపోయిన సంగతి తెలిసిందే.గత జూన్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు ఇస్తాంబుల్‌లో ఎయిర్‌పోర్ట్‌ వద్ద తుపాకులు, బాంబులతో మారణహోమం సృష్టించి 44 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఘజియాన్‌టేప్‌లో బాంబు దాడిన జరిగిన ప్రాంతాన్ని, సరిహద్దు మార్గాలను మూసివేసి.. పోలీసులు ఆయా ప్రాంతాలను మొత్తం తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సెక్‌ బృందం ఘటనా స్థలికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రిస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com