‘డేవిడ్ రెడ్డి’ నుంచి రమ్యకృష్ణ పవర్‌ఫుల్ లుక్ విడుదల
- September 15, 2026
మంచు మనోజ్, తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. గతేడాది ‘భైరవం’, ‘మిరాయ్’ చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన, ఈ ఏడాది ‘డేవిడ్ రెడ్డి’ అనే భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హనుమ రెడ్డి యక్కంటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
1897 నుంచి 1922 మధ్య కాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోంది. కొన్ని వాస్తవ సంఘటనల ప్రేరణతో కల్పిత కథగా దీనిని రూపొందిస్తున్నారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని, సుప్రీమ్ సుందర్ యాక్షన్ సీక్వెన్స్‌లను సమకూరుస్తున్నారు. భరత్ మోతుకూరి, వెంకటరెడ్డి నల్లగంగుల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రిటిషర్లతో పాటు పలువురికి శత్రువుగా ఉండే రగ్డ్ అండ్ పవర్‌ఫుల్ పాత్రలో మనోజ్ కనిపించనున్నారు.
‘కమల రెడ్డి’గా రమ్యకృష్ణ ఊరమాస్ అవతారం
సీనియర్ నటి రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంచు మనోజ్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో ఆమె ‘కమల రెడ్డి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
“ఆమె యుద్ధరంగానికి భయపడదు.. యుద్ధరంగమే ఆమెను చూసి భయపడుతుంది” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. వెనుక సింహాసనం, కింద మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న రక్తపాతం మధ్య పాలెగత్తె తరహాలో రమ్యకృష్ణ గంభీరంగా కూర్చున్న లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘బాహుబలి’ తర్వాత ఆమెకు అంతటి శక్తివంతమైన పాత్ర లభించిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో పేషెంట్ సేఫ్టీకి PHCC కీలక చర్యలు..స్పెషల్ క్యాంపెయిన్..!!
- యూఏఈ స్కూళ్లలో కఠిన నిబంధనలు.. హెయిర్‌స్టైల్, హూడీలు, ఎనర్జీ డ్రింక్స్‌పై ఆంక్షలు..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- GCC దేశాల బ్యాంకింగ్ సహకారం మరింత బలోపేతం..!!
- సౌదీ అరేబియాలోని మూడు నగరాలపై హౌతీ దాడులు..!!
- కువైట్‌లో కీలక రహదారి 5 రోజులపాటు మూసివేత..!!
- మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!
- అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్
- UPI ఛార్జీల పై ఈ వారంలో కీలక ప్రకటన!
- తెలంగాణ–ఆగా ఖాన్ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలి







