974 బీచ్‌లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!

- September 16, 2026 , by Maagulf
974 బీచ్‌లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!

దోహా: కుటుంబాలతో కలిసి బీచ్‌లో సరదాగా గడిపేందుకు ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 18న 974 బీచ్‌లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కుటుంబాలు, నివాసితులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా ఆహ్వానించింది. సురక్షితమైన, కుటుంబస్నేహపూర్వక వాతావరణంలో వివిధ వినోద, ఆహ్లాదకరమైన కార్యక్రమాలతో ప్రత్యేక బీచ్ డే నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఫెస్టివల్‌లో భాగంగా పిల్లలు, పెద్దల కోసం ప్రత్యేక ఉచిత స్విమ్మింగ్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా లేడీస్ ఓన్లీ ఏరియా కూడా అందుబాటులో ఉంటుంది. సందర్శకుల భద్రత కోసం రోజంతా బీచ్‌లో లైఫ్‌గార్డులు అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. అలాగే షవర్ సదుపాయం, సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు రెస్ట్ ఏరియాను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఆరు సంవత్సరాల లోపు పిల్లలు, దివ్యాంగులకు ప్రవేశం ఉచితం. 14 ఏళ్ల లోపు పిల్లలకు QR15, పెద్దలకు QR35, వాహన ప్రవేశానికి QR150 గా నిర్ణయించారు. బీచ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి వినోదభరితంగా గడిపేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com