ఖతార్‌లో విస్తరిస్తోన్న స్మార్ట్ సిటీల మార్కెట్..!!
- September 16, 2026
దోహా: ఖతార్‌లో స్మార్ట్ సిటీల మార్కెట్ భారీగా విస్తరించనుంది. 2034 నాటికి ఈ మార్కెట్ విలువ $10.9 బిలియన్లు (QR39.68 బిలియన్లు) చేరుతుందని IMARC గ్రూప్ మార్కెట్ నివేదిక అంచనా వేసింది. 2026 నుంచి 2034 మధ్య ఈ రంగం 14.14 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)తో అభివృద్ధి చెందుతుందని తెలిపింది.
ప్రభుత్వం డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, సుస్థిర పట్టణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, IoT ఆధారిత వ్యవస్థలు, సమీకృత పట్టణ నిర్వహణ ప్లాట్‌ఫామ్‌లలో ఖతార్ చేస్తున్న వ్యూహాత్మక పెట్టుబడులు దేశంలోని నగరాల రూపురేఖలను వేగంగా మారుస్తున్నాయి.
స్మార్ట్ మొబిలిటీ పరిష్కారాలు, ఇంధన సామర్థ్య భవన సాంకేతికతలు, సిటిజన్ కోసం డిజిటల్ సేవలు కలిసి ఖతార్ స్మార్ట్ సిటీస్ మార్కెట్ వృద్ధికి బలాన్నిస్తున్నాయని IMARC పరిశోధకులు తెలిపారు.
స్మార్ట్ ట్రాన్స్పోర్ట్దే కీలక వాటా
స్మార్ట్ సిటీస్ మార్కెట్లో స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ 34 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థలు, మెట్రో నెట్వర్క్ విస్తరణ, ఆటోమేటిక్ వాహనాల పైలట్ ప్రోగ్రామ్‌లలో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టడం ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఈ విభాగంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ 30 శాతం వాటాతో ముందున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రహదారి భద్రతను పెంచేందుకు AI ఆధారిత విశ్లేషణ, రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థలపై ఖతార్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
స్మార్ట్ బిల్డింగ్స్, యుటిలిటీస్లోనూ వేగం
సుస్థిరతకు సంబంధించిన కార్యక్రమాల ప్రభావం స్మార్ట్ బిల్డింగ్స్, యుటిలిటీస్ రంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. స్మార్ట్ బిల్డింగ్స్ మార్కెట్లో బిల్డింగ్ ఎనర్జీ ఆప్టిమైజేషన్ 38 శాతం వాటాతో అతిపెద్ద విభాగంగా ఉంది. గ్లోబల్ సస్టైనబులిటీ అసెస్మెంట్ సిస్టం (GSAS) సర్టిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగా భవనాల నిర్మాణం, అధునాతన భవన నిర్వహణ వ్యవస్థల వినియోగం దీనికి దోహదం చేస్తున్నాయి. అదే సమయంలో స్మార్ట్ యుటిలిటీస్‌లో అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 42 శాతం వాటాతో అతిపెద్ద విభాగంగా ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ మీటర్లను స్మార్ట్ మీటర్లుగా మార్చే కార్యక్రమాలు ఈ విభాగానికి ఊతమిస్తున్నాయి.
స్మార్ట్ హెల్త్‌కేర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
సిటిజన్స్ కేంద్రిత డిజిటల్ సేవల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విభాగంలో స్మార్ట్ హెల్త్‌కేర్ 29 శాతం వాటాతో ముందుంది. టెలీమెడిసిన్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల అనుసంధానం, ప్రభుత్వ వైద్య సంస్థల్లో AI ఆధారిత డయాగ్నస్టిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండటం దీనికి కారణంగా నివేదిక పేర్కొంది.
దోహాదే అతిపెద్ద ప్రాంతీయ మార్కెట్
ఖతార్‌లోని ప్రాంతీయ మార్కెట్లలో దోహా 46 శాతం వాటాతో అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు, ప్రముఖ అభివృద్ధి ప్రాజెక్టులు దోహా మార్కెట్ ఆధిపత్యానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, సుస్థిర పట్టణ ప్రణాళికపై కొనసాగుతున్న పెట్టుబడులతో ఖతార్‌లో స్మార్ట్ సిటీ పరిష్కారాల వినియోగం రానున్న సంవత్సరాల్లో మరింత విస్తరించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ ఇతరుల లగేజీపై ప్రయాణికులకు కీలక హెచ్చరిక..!!
- ఓజోన్ పొర పరిరక్షణకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- ఖతార్‌లో విస్తరిస్తోన్న స్మార్ట్ సిటీల మార్కెట్..!!
- మక్కా టార్గెట్ గా హౌతీ డ్రోన్.. కూల్చివేసిన సౌదీ..!!
- ఒమన్ సహా గల్ఫ్ దేశాల్లో CBSE ప్రత్యేక పరీక్షలు..!!
- యూఏఈలో ఫ్లూ క్యాంపెయిన్ విస్తరణ..!!
- 974 బీచ్‌లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!
- కువైట్‌లో ప్రవాసులకు లోన్లు మరింత కఠినం..!!
- సౌదీ–ఖతార్‌లో కొత్త చెల్లింపు సదుపాయం..!!
- ఆర్థిక, ఆర్థిక సహకారం బలోపేతంపై బహ్రెయిన్–సెర్బియా చర్చలు..!!







