ఓజోన్ పొర పరిరక్షణకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- September 16, 2026
మనామా: ఓజోన్ పొర పరిరక్షణతో పాటు వాతావరణ మార్పుల నియంత్రణ, ఇంధన సామర్థ్యం, సుస్థిర శీతలీకరణ సాంకేతికతల అభివృద్ధికి బహ్రెయిన్ మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు చర్యలను మరింత వేగవంతం చేస్తున్నట్లు బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అధ్యక్షుడు, రాజు వ్యక్తిగత ప్రతినిధి హెచ్‌హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ ఖలీఫా తెలిపారు.
ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓజోన్ పొర పరిరక్షణను వాతావరణ లక్ష్యాలతో అనుసంధానిస్తూ, మరింత సమర్థవంతమైన శీతలీకరణ సాంకేతికతల వైపు మార్పును కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రపంచ ఓజోన్ దినోత్సవం “గ్లోబల్ యాక్షన్ ఫర్ ఏ కూలర్ ప్లానెట్” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇది మాంట్రియల్ ప్రోటోకాల్‌లోని కిగాలి సవరణకు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
2030 నాటికి HCFCలకు పూర్తిగా ముగింపు
హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ (HCFCs) వినియోగాన్ని దశలవారీగా తగ్గించే బహ్రెయిన్ జాతీయ వ్యూహంలో భాగంగా మూడో, తుది దశను ప్రారంభించింది. ఈ దశలో 2030 నాటికి HCFC వినియోగాన్ని 100 శాతం తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదపడనుంది.
2026–2028 నేషనల్ కూలింగ్ ప్లాన్
బహ్రెయిన్ 2026–2028 బహ్రెయిన్ నేషనల్ కూలింగ్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళిక అమలు 2047 వరకు కొనసాగనుంది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, ఇంధన సామర్థ్యం, సాంకేతికత, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారు.
పర్యావరణహిత శీతలీకరణకు ప్రాధాన్యం
సురక్షితమైన, మరింత సమర్థవంతమైన శీతలీకరణ సాంకేతికతలను ప్రోత్సహించడంతో పాటు, శీతలీకరణ వాయువుల రికవరీ, రీసైక్లింగ్, రీక్లమేషన్ వ్యవస్థలను విస్తరించనున్నట్లు షేక్ అబ్దుల్లా తెలిపారు. అలాగే పర్యావరణ నిబంధనలను మరింత బలోపేతం చేయడం, దేశీయ నిపుణుల సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ పర్యావరణ బాధ్యతలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పట్ల బహ్రెయిన్ తన నిబద్ధతను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







