ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!

- September 18, 2026 , by Maagulf
ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!

మస్కట్:ఒమన్‌లోని నవంబర్ 18 స్ట్రీట్‌పై తాత్కాలికంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 18 తెల్లవారుజాము నుంచి ఈ ట్రాఫిక్ డైవర్షన్ అమల్లోకి రానుంది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అల్ మౌజ్ రౌండ్ఎబాట్ (Al-Mouj Roundabout) తర్వాత నుంచి ఎయిర్ పోర్ట్ బ్రిడ్జి ముందు వరకు ఉన్న నవంబర్ 18 స్ట్రీట్ భాగంలో ఈ మళ్లింపు ఉంటుంది. అల్ అజైబా (Al-Azaiba) వైపు వెళ్లే వాహనాలకు ఈ మార్పు వర్తిస్తుందని తెలిపారు.

ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సైన్‌బోర్డులను తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. తాత్కాలిక ట్రాఫిక్ ఏర్పాట్ల కారణంగా ప్రయాణ సమయం మారే అవకాశం ఉన్నందున వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రాఫిక్ సజావుగా, సురక్షితంగా సాగేందుకు తాత్కాలిక మార్గదర్శకాలను పాటించాలని వాహనదారులను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com