యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!

- September 18, 2026 , by Maagulf
యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!

న్యూయార్క్: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డా. అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీ 81వ సెషన్ అధ్యక్షుడు డా. ఖలీల్ అల్ రహ్మాన్ తో భేటీ అయ్యారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరఫున జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపారు. ప్రస్తుత సెషన్‌ను విజయవంతంగా నడిపించాలని ఆకాంక్షించారు.

యూఎన్‌తో బహ్రెయిన్ సహకారంపై చర్చ
సమావేశంలో బహ్రెయిన్–ఐక్యరాజ్యసమితి మధ్య కొనసాగుతున్న సహకారంపై చర్చించారు. ముఖ్యంగా అభివృద్ధి, ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ శాంతి కోసం బహ్రెయిన్ చేస్తున్న సహకారాన్ని సమీక్షించారు. అలాగే జనరల్ అసెంబ్లీ ఎజెండాలోని కీలక అంశాలు, ప్రాంతీయ పరిణామాలు, ఈ ప్రాంతంలోని దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఇరువురు చర్చించారు.

హోర్ముజ్ జలసంధి, బాబ్ ఎల్-మందెబ్ జలసంధుల్లో నౌకాయానానికి ఎదురవుతున్న అంతరాయాల ప్రభావాలపై కూడా ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు. అదేవిధంగా ప్రాంతీయ ఘర్షణలు, పరస్పర ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై కూడా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో బహ్రెయిన్ శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ జమాల్ ఫారెస్ అల్ రువైయీతో పాటు విదేశాంగ మంత్రి వెంట ఉన్న ప్రతినిధి బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com