ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- September 18, 2026
దోహా: ఖతార్‌లో మరోసారి UFC ఫైట్ నైట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది జరిగిన తొలి UFC ఈవెంట్ విజయవంతం కావడంతో ఈ ఏడాది కూడా దోహాలో ఈ అంతర్జాతీయ MMA ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు విజిట్ ఖతార్ ప్రకటించింది. నవంబర్ 21న దోహాలోని అలీ బిన్ హమద్ అట్టియ్హా అరేనా (Ali Bin Hamad Al Attiyah Arena)లో జరగనుంది. ఖతార్‌లో ఏడాది పొడవునా అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లను నిర్వహించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే UFCని మరోసారి దోహాకు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 9 నుంచి టికెట్ల విక్రయం
UFC ఫైట్ నైట్ టికెట్లు అక్టోబర్ 9నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. అభిమానులు ముందుగానే తమ ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లను పొందే అవకాశాన్ని మెరుగుపరుచుకునేందుకు UFC.com/Qatarలో ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
విజిట్ ఖతార్ సీఈఓ ఇంజినీర్ అబ్దులజీజ్ అలీ అల్-మౌలవి మాట్లాడుతూ.. దోహాలో UFC ఫైట్ నైట్ నిర్వహించడం ఖతార్‌లో పెరుగుతున్న ప్రపంచస్థాయి క్రీడా ఈవెంట్ల క్యాలెండర్‌కు ముఖ్యమైన చేరిక అని తెలిపారు. గతేడాది ఈవెంట్ విజయాన్ని కొనసాగిస్తూ UFC అభిమానులను మరోసారి దోహాకు ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నామని చెప్పారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లను నిర్వహించడం ద్వారా క్రీడాభిమానులను ఖతార్‌కు ఆకర్షించడంతో పాటు దేశంలోని హాస్పిటాలిటీ, సంస్కృతి, వినోదం వంటి రంగాలను అంతర్జాతీయ సందర్శకులకు పరిచయం చేయాలని విజిట్ ఖతార్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. UFC ఫైట్ నైట్ వంటి ఈవెంట్ల ద్వారా ఖతార్‌ను ప్రపంచస్థాయి క్రీడా గమ్యస్థానంగా మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







