సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- September 18, 2026
రియాద్: పేషంట్ల గోప్యతకు భంగం కలిగించారన్న ఆరోపణలపై ఓ ప్రవాస పీడియాట్రిషియన్పై సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) విచారణ ప్రారంభించింది. వైద్య సేవలు అందించే సమయంలో డాక్టర్ రోగులను వీడియోలు, ఫొటోలు తీసినట్లు, అనంతరం వారి గోప్యతకు భంగం కలిగించే విధంగా ఆ చిత్రాలను ప్రచురించినట్లు సోషల్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అలాగే సౌదీ వైద్య సిబ్బందిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి, సంబంధిత వైద్యుడిని పిలిపించి విచారణ చేపట్టింది. రోగుల హక్కులు, గోప్యతను పరిరక్షించడం, ఆరోగ్య నిబంధనలు, చట్టాలు, వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను పాటించేలా చూడటం తమ పర్యవేక్షణ బాధ్యతలో భాగమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆసుపత్రిపై కూడా చర్యలు
సంబంధిత వైద్యుడు పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రం/వైద్య సంస్థపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు MoH వెల్లడించింది. అలాగే వైద్యుడిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపింది. తమ పరిధిలోని తదుపరి చట్టపరమైన ప్రక్రియను ఆ అధికారులు పూర్తి చేయనున్నారు. రోగుల గోప్యతకు భంగం కలిగించడం, వారి గౌరవాన్ని ఉల్లంఘించడం లేదా ఆరోగ్య నిబంధనలు, వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను ఉల్లంఘించడం వంటి చర్యలపై చట్టప్రకారం చర్యలు తప్పవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
937కు ఫిర్యాదు
సౌదీలోని ఆరోగ్య కేంద్రాలు, వైద్య సిబ్బంది నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయంపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని MoH తెలిపింది. ఆరోగ్య సేవలకు సంబంధించిన ఏవైనా ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు యూనిఫైడ్ కాల్ సెంటర్ 937 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. దీనివల్ల రోగులు, ఆరోగ్య సేవలు పొందుతున్న వారి హక్కులను రక్షించడంతో పాటు ఆరోగ్య సేవల భద్రత, నాణ్యతను మెరుగుపరచేందుకు సహకరించినట్లవుతుందని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







