సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!

- September 18, 2026 , by Maagulf
సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!

రియాద్: సౌదీ అరేబియా నేషనల్ డే వేడుకల సందర్భంగా నిర్వహించనున్న వైమానిక విన్యాసాల తేదీలు, ప్రాంతాలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జెడ్డాలో ప్రారంభమయ్యే ఈ ఎయిర్ షోలు అల్ ఖోబర్‌లో ముగియనున్నాయి.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న సౌదీ నేషనల్ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా జెడ్డా, రియాద్, అల్ ఖోబర్ నగరాల ఆకాశంలో వైమానిక విన్యాసాలను నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

సెప్టెంబర్ 18 నుంచి జెడ్డాలో..

జెడ్డాలో ఎయిర్ షోలు సెప్టెంబర్ 18న సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమవుతాయి. రోషన్ వాటర్‌ఫ్రంట్ వద్ద, జెడ్డా హిల్టన్ హోటల్ ఎదుట ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. జెడ్డాలో ఎయిర్ షోలు సెప్టెంబర్ 20 వరకు కొనసాగుతాయి.

రియాద్‌లో రెండు రోజుల పాటు

రియాద్‌లో సెప్టెంబర్ 22, 23 తేదీల్లో సాయంత్రం 4:00 గంటలకు వైమానిక విన్యాసాలు జరగనున్నాయి. మల్హమ్‌లోని రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద వీటిని నిర్వహించనున్నారు.

అల్ ఖోబర్‌లో సెప్టెంబర్ 26, 27న

నేషనల్ డే ఎయిర్ షోల ముగింపు కార్యక్రమాలు అల్ ఖోబర్‌లో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరగనున్నాయి. అల్ ఖోబర్ వాటర్‌ఫ్రంట్‌లోని ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దులఅజీజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఎదుట ఈ వైమానిక విన్యాసాలను నిర్వహించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com