ఉజ్జయినీ నగరం నిట మునిగింది...
- August 21, 2016
మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీ నగరం నిట మునిగింది. దేవాలయాలు సయితం నీటిలో మునిగిపోయాయి. త్రిపుర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీలోని సిప్రా నదిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో నదీ తీరంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఆలయ గోపురాలు కూడా కనిపించని పరిస్థితి, స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. నగరంలోని చాలా ఆలయాలు మూసివేశారు. మధ్యప్రదేశ్ అంతటా ఇదే పరిస్థితి. వరదలకు ఒక్కరోజే 15 మంది మృతి చెందారు. వరద ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు చేపడుతోంది. మరో 24 గంటలపాటు మధ్యప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.గుణ, ఇండోర్, ఉజ్జయినీ, దేవా, ఛత్రపూర్‌లలో నిలు నిలిచిపోయింది. వరద బాధితులను ఆదుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







