#కల్ట్ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
- September 19, 2026
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన ప్రతిష్టాత్మక చిత్రం #కల్ట్‌తో రాబోతున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేసే విశ్వక్ ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే కూడా రాస్తూ ప్రాజెక్ట్ పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియాస్ ఫస్ట్ అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు.
నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపరిచే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డార్క్, ఇంటెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా #CULT తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రపంచాన్ని, కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ క్యూరియాసిటీ పెంచింది. అలాగే స్నేహాన్ని పరిచయం చేస్తూ విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు కూడా మంచి స్పందన లభించింది.
తాజాగా మేకర్స్ #CULT రిలీజ్ డేట్‌ను థ్రిల్లింగ్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది.
రిలీజ్ డేట్ గ్లింప్స్ మరోసారి సినిమా కథా నేపథ్యంపై ఆసక్తిని పెంచింది. విశ్వక్ సేన్ ఇంటెన్స్ కిల్లింగ్ స్ప్రీ, కోపంతో కూడిన యాటిట్యూడ్ ఈ వీడియోను మరింత షాకింగ్‌గా మార్చాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్ తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. సినిమా ఎలాంటి డార్క్ వరల్డ్‌లోకి తీసుకెళ్లబోతుందో ఈ విజువల్స్ హింట్ ఇచ్చాయి.
రవి బస్రూర్ అందించిన పల్సేటింగ్, ఇంటెన్సిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్, క్యూరియాసిటీని మరింత పెంచింది.
ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, EZY, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాఖ్ నాయర్, చెపూరి వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#CULTకు బలమైన టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించగా.. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే మ్యాసీవ్ సెట్స్‌తో సినిమాకు ప్రత్యేకమైన విజువల్ వరల్డ్‌ను క్రియేట్ చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ అప్పీల్ ఉన్న కథను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో #CULTను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో మల్టీలింగ్వల్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: విశ్వక్సేన్, గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, EZY, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాఖ్ నాయర్, చేపూరి వివేక్
సాంకేతిక సిబ్బంది:
రచన, నిర్మాత, దర్శకత్వం: విశ్వక్సేన్
నిర్మాత: సందీప్ కాకరాల
బ్యానర్లు: తారక్ సినిమాస్
లైన్ ప్రొడ్యూసర్: అవినాష్ యార్లగడ్డ
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
సంగీతం: రవి బస్రూర్
DOP: అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
కొరియోగ్రాఫర్: వశ్వంత్ మాస్టర్
స్టంట్స్: కరుణక్ ఏఆర్, జాషువా
కాస్ట్యూమ్ డిజైనర్: జి అన్నపూర్ణ
PRO: వంశీ-శేఖర్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







