ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో భారత్‌ నౌకలకు మినహాయింపు

- November 04, 2026 , by Maagulf
ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో భారత్‌ నౌకలకు మినహాయింపు

 ప్రపంచ చమురు, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భారతదేశంతో పాటు తమ మిత్రదేశాలైన చైనా, ఇరాక్, ఖతార్‌లకు చెందిన నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్-మొగద్దమ్ వెల్లడించారు.

నాలుగు దేశాలకు స్వేచ్ఛా రవాణా

ఇతర దేశాల వాణిజ్య నౌకలపై ఉన్న ఆంక్షలు ఏవీ వర్తించకుండా భారత్‌, చైనా, ఇరాక్, ఖతార్ దేశాలకు చెందిన నౌకలు ఇకపై హర్మూజ్ జలసంధిని స్వేచ్ఛగా దాటవచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. తమ దృష్టిలో ఈ నాలుగు దేశాల నౌకల రాకపోకలకు ఎలాంటి అవరోధాలు ఉండవని, అమెరికన్లు కూడా ఈ నౌకలను అడ్డుకోలేరని అమీర్ హయత్ పేర్కొన్నారు.

ఔషధ సరఫరా, దౌత్య ప్రయోజనాలే లక్ష్యం

ఈ ప్రత్యేక మినహాయింపుల వెనుక తమ దౌత్య, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఇరాన్ తెలిపింది.భారత్‌తో: భారత్ నుంచి ఇరాన్‌కు అవసరమైన ఔషధాల దిగుమతిని, సరఫరాను సులభతరం చేసే లక్ష్యంతోనే భారత నౌకలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

చైనాతో: అంతర్జాతీయ వేదికలపై చైనా నుంచి రాజకీయ దౌత్యపరమైన మద్దతును పొందడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని వివరించారు.

రవాణా రుసుము వసూలు

ఈ నాలుగు దేశాల నౌకలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చి స్వేచ్ఛగా ప్రయాణించే వెసులుబాటు కల్పించినప్పటికీ, ఆయా దేశాల నౌకల నుంచి నిబంధనల ప్రకారం రవాణా రుసుమును (Transit fee) మాత్రం వసూలు చేస్తామని ఇరాన్ ప్రతినిధి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com