ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- September 20, 2026
జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అదిరిపోయే విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. పూల్-Bలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌పై భారత్ ఏకంగా 19-0 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.. ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశం కూడా దక్కలేదు.
దీపిక అద్భుత ప్రదర్శన
ఈ భారీ విజయంలో భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక కీలక పాత్ర పోషించింది. ఆమె ఒక్కరే ఏకంగా 8 గోల్స్ సాధించి ప్రత్యర్థి రక్షణను ఛేదించింది. ఇషికా మూడు గోల్స్‌తో రాణించగా.. ఇతర భారత ఆటగాళ్లు కూడా తమ వంతు సహకారం అందించారు.
తొలి అర్ధభాగంలోనే ఆధిపత్యం
భారత్ మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 8-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ గోల్స్ వరద కొనసాగించడంతో చివరకు 19-0తో మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో భారత మహిళల హాకీ జట్టు ఏషియన్ గేమ్స్‌లో శుభారంభం చేసింది. టోర్నీలో తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







