ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం

- September 20, 2026 , by Maagulf
ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం

జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు అదిరిపోయే విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. పూల్-Bలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌పై భారత్ ఏకంగా 19-0 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.. ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశం కూడా దక్కలేదు.

దీపిక అద్భుత ప్రదర్శన
ఈ భారీ విజయంలో భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక కీలక పాత్ర పోషించింది. ఆమె ఒక్కరే ఏకంగా 8 గోల్స్ సాధించి ప్రత్యర్థి రక్షణను ఛేదించింది. ఇషికా మూడు గోల్స్‌తో రాణించగా.. ఇతర భారత ఆటగాళ్లు కూడా తమ వంతు సహకారం అందించారు.

తొలి అర్ధభాగంలోనే ఆధిపత్యం
భారత్ మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 8-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ గోల్స్ వరద కొనసాగించడంతో చివరకు 19-0తో మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో భారత మహిళల హాకీ జట్టు ఏషియన్ గేమ్స్‌లో శుభారంభం చేసింది. టోర్నీలో తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com