ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- September 20, 2026
మస్కట్: ఒమన్‌లోని ధోఫార్ ఖరీఫ్ సీజన్-2026 సందర్భంగా సలాలా ఎయిర్‌పోర్ట్ కు ప్రయాణికులు పోటెత్తారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 686,808 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. మొత్తం 5,148 విమానాల రాకపోకలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విమానాల సంఖ్య 4 శాతం పెరిగింది.
ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న కొద్దీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. జూన్ నెలలో 92,735 మంది, జూలైలో 236,088 మంది, ఆగస్టులో 357,985 మంది వచ్చిపోయారు. విమానాల రాకపోకలు కూడా ఇదే విధంగా పెరిగాయి. జూన్‌లో 957 విమానాలు ఉండగా, జూలైలో 1,854, ఆగస్టులో 2,337 విమానాలు వచ్చిపోయాయి.
పర్యాటక రంగానికి ఖరీఫ్ కీలకం
ధోఫార్ ఖరీఫ్ సీజన్‌లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడంతో విమాన ప్రయాణాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం పడిందని ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. పెరుగుతున్న సీజనల్ డిమాండ్‌ను నిర్వహించే సామర్థ్యం ఒమన్ విమానయాన రంగానికి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికార ప్రతినిధి హామెద్ బిన్ అహ్మద్ అల్ బరాష్ది తెలిపారు.
పర్యాటక రంగానికి విమాన రవాణా కీలకమైన మద్దతు ఇస్తుందని, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంతో పాటు ఒమన్ గవర్నరేట్లను, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలను మరింత అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అల్ బరాష్ది పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం







